రైలు చివరి బోగి వెనుక 'X' మార్క్ ఎందుకుంటుందో తెలుసా..?
నేటీ సమాజంలో ప్రతి పౌరుడు ఎదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఆ సమయంలో తమ ముందు నుంచి అనేక రైళ్లు పోతుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: నేటీ సమాజంలో ప్రతి పౌరుడు ఎదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఆ సమయంలో తమ ముందు నుంచి అనేక రైళ్లు పోతుంటాయి. వాటి చివరి బోగి పై ఉన్న 'X' మార్క్ అసలు ఎందుకు ఉంది. దాని అర్ధం ఎంటీ అని ప్రశ్నించుకుంటారు. ఈ క్రమంలో ఎవరినైనా అడిగితే.. అది ప్రమాదపు గుర్తు అని. లేదా.. వెనక నుంచి వచ్చే మరో రైలుకు హెచ్చరిక అని తెలిసి తెలియక చెబుతూ ఉంటారు. కానీ దాని అర్థం వేరే ఉంది. రైలు చివరి బోగి వెనుక 'X' మార్క్ అనేది రైల్వే అధికారులకు తెలిసిన చిహ్నం.
రైలు చివరిబోగిపై 'X' మార్క్ ఉంటే.. ఆ బోగి రైలు చివరిది అని అర్థం. దీంతో ఆ బోగి పూర్తిగా ప్లాట్ ఫామ్‌ను దాటి వెళ్తెనే ట్రైన్ ఆ స్టేషన్‌ను క్రాస్ చేసినట్లు అధికారులు గుర్తిస్తారు. అలా కాకుండా 'X' మార్క్ ఉన్న భోగి కనిపించక పోతే వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై.. అన్ని స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేస్తారు. దీంతో అదికారులు వెంటనే మిస్సైన బోగి కోసం చర్యలు ప్రారంభిస్తారు. లేదా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాగా ఇటీవల ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు.