ప్రధానికి ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా? ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కూడా మెజార్టీ సీట్లు సాధించాలని బీజేపీ విస్తృత ప్రచారం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తాజాగా ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను ప్రస్తావించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కూడా మెజార్టీ సీట్లు సాధించాలని బీజేపీ విస్తృత ప్రచారం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తాజాగా ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పూర్తి ఇంటర్వ్యూను పోస్ట్ చేశారు. అందులో ఓ టాపిక్ మన తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. అయితే ప్రధాని అందర్నీ ఆకర్షించే విధంగా పంచె కట్టు, మెడలో కండువా ధరించి తమిళ టీవి చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన తమిళ ఆహారం ఏమిటి? ఇడ్లీ లేక దోశ? అని టీవీ యాంకర్ ప్రధాని మోడీని కుతూహలంగా అడుగుతారు. ఉప్మా తనకు ఇష్టమైన తమిళ ఆహారం అని ప్రధాని మోడీ పంచుకున్నారు. సాధారణంగా, ప్రతి ఒక్కరూ ఇడ్లీ లేదా దోశ అని చెబుతారు, కాబట్టి ప్రధాని మోదీ తనకు ఉప్మా ఇష్టం అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. పొట్టలో తేలికగా ఉండి సులభంగా జీర్ణం అవుతుందని, పొంగల్ అంటే తనకు కూడా ఇష్టమని చెప్తారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సాధారణంగా, ప్రతి ఒక్కరూ ఇడ్లీ లేదా దోశ అని చెబుతారు, కానీ ప్రధాని మోడీ తనకు ఉప్మా ఇష్టం అని చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. నెటిజన్లలో చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం లేదని చెబుతున్నారు. కొంత మంది ఉప్మా అంటే మాకు ప్రాణమని, ఈ సారి మ్యానిఫెస్టోలో కూడా ఉప్మా పెట్టిస్తామని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని మోడీ ఐక ఉప్మా వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి అని కొందరూ ఉప్మా ప్రేమికులు ప్రధానికి ఓ పదవి కూడా ఇచ్చేశారు.
Read More..
కాంగ్రెస్ కు సుప్రీంలో ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ అధికారులు