సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన ఢిల్లీ సీఎం

లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు.

Update: 2023-04-16 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. అయితే ముందుగా ఆయన రాజ్ ఘాట్ కు వెళ్లి అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారని సమాచారం. అక్కడి నుంచి నేరుగా సీబీఐ కార్యాలయానికి చేరుకుంటారని ఆప్ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. లిక్కర్ కేసు విచారణ కోసం సీబీఐ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు (ఏప్రిల్ 16న) విచారణకు రావాలని సీబీఐ ఆయనకు తెలిపింది. 

ఇక సీబీఐ కార్యాలయానికి బయలుదేరే ముందు కేజ్రీవాల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందిన మండిపడ్డారు. ఎన్ని బెదిరింపులకు గురి చేసినా భయపడేదిలేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News