Tungabhadra : తుంగభద్ర‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం డీకే కీలక ప్రకటన

కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ 19 వ గేట్ నిన్న రాత్రి భారీ వరదలకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-08-11 12:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ 19 వ గేట్ నిన్న రాత్రి భారీ వరదలకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం కావడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఆదివారం నాడు పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ గేటు ధ్వంసం కావడం బాధాకరంగా ఉందని చెప్పారు. తుంగభద్ర డ్యామ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయిని అని తెలిపారు.

ఈ డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగతా నీటిని విడుదల చేయడం ద్వారా రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.వీలైనంత తొందరగా గేటు పునరుద్ధరణ ప్రక్రియ చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు మాత్రం నీరు అందించడం కొంచెం కష్టమేనని, ఇందుకు రైతులు సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు.

Tags:    

Similar News