Dilhi coaching center: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన..వరదలో కారు నడిపిన వ్యక్తికి బెయిల్
ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లోకి వరదలు రావడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన కారు డ్రైవర్ మనుజ్‌కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లోకి వరదలు రావడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన కారు డ్రైవర్ మనుజ్‌కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5000 పూచీ కత్తుపై బెయిల్ ఇచ్చింది. నీటితో నిండిపోయిన రోడ్డుపై తన కారును అధిక వేగంతో నడిపాడని, దీని కారణంగానే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బేస్‌మెంట్ డోర్ విరిగి సెల్లార్‌లోకి నీరు చేరిందని ఆరోపణలున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో సైతం చక్కర్లు కొట్టింది. దీంతో వీడియో ఆధారంగానే మనుజ్‌ను జూలై 29వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు అంగీకరించింది. అంతకుముందు విచారణలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ని హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇలాంటి ఘటనలు వ్యవస్థ వైఫల్యమేనని పేర్కొంది.