Devendra Fadnavis: మహారాష్ట్ర నెక్ట్స్ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Election Results) మహాయుతి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.

Update: 2024-11-23 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Election Results) మహాయుతి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మహారాష్ట్రలో (Maharashtra Assembly elections) 288 అసెంబ్లీ స్థానాల్లో 200కు పైగా సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. ఫలితాలు విడుదలయ్యే టైంలో మహారాష్ట్ర్ నెక్ట్స్ సీఎం ఎవరనే దానిపై చర్చ ప్రారంభమైంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis)కే ముఖ్యమంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ ధరేకర్ (BJP spokesperson Pravin Darekar) వెల్లడించారు. అలాగే ఆయనతో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్‌ బవాన్కులే భేటీ కానున్నారు.

ముంబైకి కేంద్ర పరిశీలకులు..

మరోవైపు, బీజేపీ అధిష్ఠానం ముంబైకి కేంద్ర పరిశీలకులను పంపనున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలతో కేంద్ర పరిశీలకులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. అయితే, గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇదిలాఉంటే.. నాగ్‌ఫుర్ సౌత్‌వెస్ట్ నియోజకవర్గం నుంచి వెలువడుతోన్న ఫలితాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్‌ 101, శివసేన (Uddhav) 95, ఎన్సీపీ (SP) 86 సీట్లలో బరిలో దిగగా.. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మహారాష్ట్రలో 12 స్థానాల్లో మహాయుతి గెలవగా.. 203 స్థానాల్లో ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడీ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Tags:    

Similar News