US Presidential Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘అమ్మ సెంటిమెంట్’.. తల్లి ఫోటోతో కమలా హ్యారిస్ ఎమోషనల్ పోస్ట్

అమెరికా ఎన్నికల్లో అటు రిపబ్లికన్ పార్టీ (Republican Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఇటు డెమోక్రటిక్ పార్టీ (Democratic Party) అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

Update: 2024-11-03 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ఎన్నికల్లో అటు రిపబ్లికన్ పార్టీ (Republican Party) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఇటు డెమోక్రటిక్ పార్టీ (Democratic Party) అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారా అని అగ్రరాజ్యంతోపాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరు గెలవాలన్నా వారి గెలుపునకు యూఎస్‌లోని భారతీయుల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో అటు ట్రంప్‌తో పాటు ఇటు కమలా హ్యారిస్ ఇద్దరూ ఇండియన్ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే పక్కా అమెరికన్ అయిన డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కంటే భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్‌కు ఇండియన్స్‌ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో ఈ రోజు (ఆదివారం) ఎక్స్ వేదికగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌లో కమలా హ్యారిస్ (Kamala Harris) తన తల్లి శ్యామలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారామె. ‘‘నా తల్లి శ్యామలా గోపాలన్‌ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా భారత్‌ నుంచి అమెరికా వచ్చారు. ఆమె ధైర్యం, ధృడ నిశ్చయాలే నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చాయి. ఆమె స్ఫూర్తితోనే నేను జీవితంలో చాలా సాధించగలిగాను’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ (Syamala Gopalan) కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీలో చదువుకుంటుండగా జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్‌ హారిస్‌తో పరిచయమైంది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 1960లో వీరికి కమల జన్మించారు. కమల ఐదో ఏట తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కమల, ఆమె చెల్లి మాయలు తల్లి శ్యామల సంరక్షణలోనే పెరిగారు.


Similar News