బ్రేకింగ్ న్యూస్.. ఢిల్లీ నూతన మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్
గత కొద్దిరోజులు ఎన్నో వివాదాలకు కారణం అవుతున్న ఢిల్లీ నూతన మేయర్ ఎన్నిక ఎట్టకేలకు కంప్లీట్ అయింది.
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులు ఎన్నో వివాదాలకు కారణం అవుతున్న ఢిల్లీ నూతన మేయర్ ఎన్నిక ఎట్టకేలకు కంప్లీట్ అయింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయింది. ఓబెరాయ్ కు 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తకు 116 ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో గెలుపొందిన షెల్లీ ఒబెరాయ్‌ను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అభినందించారు. అలాగే "గూండాలు ఓడిపోయారు, ప్రజలు గెలిచారు" అని ఆయన అన్నారు.
ఎవరీ షెల్లీ ఒబెరాయ్
- షెల్లీ ఒబెరాయ్ ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
- ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ICA) జీవితకాల సభ్యురాలు కూడా..
- షెల్లీ వివిధ సమావేశాలలో అనేక అవార్డులు అందుకుంది.
- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి తత్వశాస్త్రంలో డాక్టరల్ డిగ్రీని పొందారు.