ఎలాంటి ఆధారాలు దొరకలేదు: బ్రిష్‌భూషణ్ అరెస్టుపై ఢిల్లీ పోలీసుల విభాగం కీలక వ్యాఖ్యలు

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు

Update: 2023-05-31 11:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను అరెస్టు చేయాలని కొద్దికాలంగా రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని ఢిల్లీ పోలీసు విభాగం ఉన్నతస్థాయి వర్గాలు బుధవారం వెల్లడించాయి.

‘బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదు. మరో 15 రోజుల్లో ఛార్జిషీట్‌ లేక తుది నివేదిక రూపంలో మేం కోర్టులో దర్యాప్తు వివరాలు సమర్పిస్తాం. రెజ్లర్ల ఆరోపణలను సమర్థించే అనుబంధ సాక్ష్యాలు లభ్యం కాలేదు. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన పోక్సో సెక్షన్ల కింద 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంటుంది. అందుకే దర్యాప్తు అధికారి సదరు నిందితుడిని అరెస్టు చేయలేరు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తి సాక్ష్యాలను ప్రభావితం చేయడం లేదు’ అని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 22 నుంచి మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేస్తున్నారు.

Tags:    

Similar News