Delhi liquor scam case : జైల్లోనే సీఎం కేజ్రీవాల్ పాలన వ్యవహారాలు చూస్తారు: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే.

Update: 2024-03-23 15:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ సీఎం కొనసాగే నైతిక హక్కు లేదని, ఈడీ కస్టడీలో ఉండటంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే రాష్ట్ర పాలన వ్యవహాలను చూస్తారని అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ కూడా భర్తీ చేయలేరని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగానే ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించారని గుర్తు చేశారు. 

Tags:    

Similar News