ఉచితాలపై పిటిషన్ ఇప్పుడు విచారించలేం

రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను సవాలు చేస్తూ మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకు విచారణ కోరుతున్నారు. ఎన్నికలకు మరో కొన్ని గంటలే సమయం ఉంది.

Update: 2025-02-03 18:40 GMT
ఉచితాలపై పిటిషన్ ఇప్పుడు విచారించలేం
  • whatsapp icon

- ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది

- పిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో జరుగుతాయనగా సమయ్ యాన్ అనే ఎన్జీవో తరపున రిటైర్డ్ జస్టిస్ ఎస్ఎన్ థింగ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించిన ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలపై అత్యవసర విచారణ జరపాలని సోమవారం పిల్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను సవాలు చేస్తూ మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకు విచారణ కోరుతున్నారు. ఎన్నికలకు మరో కొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే ఉచితాల ప్రభావం పడే ఉంటుంది. కాబట్టి తక్షణ విచారణ అవసరం లేదని భావిస్తున్నామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఇదే అంశంలో మరో పిటిషన్ దాఖలైంది. ఫిబ్రవరి 4న ఈ పిటిషన్ విచారించాలని అందులో కోరారు. దీంతో హైకోర్టు దీనిని విచారించేందుకు నిరాకరించింది.

Tags:    

Similar News