Delhi Govt : కనీస వేతనాలు పెంపు.. అన్ స్కిల్డ్ కార్మికులకు ప్రతినెలా రూ.18,066

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ నూతన సీఎం అతిషి బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-25 14:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ నూతన సీఎం అతిషి బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ స్కిల్డ్ కార్మికులు, సెమీ స్కిల్డ్ కార్మికులు, స్కిల్డ్ కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రతినెలా అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.18,066, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.19,929, స్కిల్డ్ కార్మికులకు రూ.21,917 చొప్పున కనీస వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని తమ ప్రభుత్వం కార్మికులకు దేశంలోనే అత్యధిక కనీస వేతనాలను అందించాలనే విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుందని అతిషి తెలిపారు. ఢిల్లీతో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల కనీస వేతనాలు సగం కూడా లేవని ఎద్దేవా చేశారు. బీజేపీ అడ్డంకులు సృష్టిస్తున్నా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఏటా రెండుసార్లు వేతన సవరణలు చేస్తోందని అతిషి చెప్పారు.


Similar News