‘‘జీ8’’ ఏర్పాటు నిజమే.. నాన్ బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్‌పై కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్!

నాన్ బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్ విషయంలో తాము పంపిన ఆహ్వానానికి ఏడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రెస్పాండ్ కాలేదన్న ప్రచారంపై కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు.

Update: 2023-03-22 13:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నాన్ బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్ విషయంలో తాము పంపిన ఆహ్వానానికి ఏడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రెస్పాండ్ కాలేదన్న ప్రచారంపై కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. తనతో సహా 8 మంది సీఎంలు గవర్నెన్స్ బాడీగా ఏర్పాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది పొలిటికల్ ప్లాట్ ఫామ్ కాదని.. ఇది గవర్నెన్స్ ప్లాట్ ఫామ్ అని చెప్పారు.

ఇందులో ఉన్న ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి నెల ఒక్కో రాష్ట్రంలో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తమ రాష్ట్రాల్లో అమలు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కంటి వెలుగు పథకం అమలు చేస్తున్నారని.. ఈ పథకాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో ప్రారంభిస్తామని గతంలోనే చెప్పామని.. ఇలాంటి కార్యక్రమాలపై తెలుసుకుని అవగాహన పెంచుకునేందుకే ఈ జీ8 ప్లాట్ ఫామ్ అన్నారు.

అయితే ఈ గ్రూప్ మొదటి సమావేశం మార్చి 18న జరగాల్సి ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు, ఇతర బిజీ కార్యక్రమాలు ఉండటం చేత ఏప్రిల్ మధ్యలో సమావేశం అవుతామని తెలిపారు. కాగా ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా (జీ8) పేరుతో ఈ ప్లాట్ ఫామ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇందులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫోరమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నాన్ పొలిటికల్ ఎజెండాతో వస్తున్న ఫోరం అనే కేజ్రీవాల్‌పైకి చెబుతున్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాన్ బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్ దిశగా ఈ సీఎంలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News