మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మ..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కొన్ని రోజులు గా ఈ కేసులో ఎలాంటి విచారణ చేయని అధికారులు తాజాగా పలువురికి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది.

Update: 2024-01-18 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కొన్ని రోజులు గా ఈ కేసులో ఎలాంటి విచారణ చేయని అధికారులు తాజాగా పలువురికి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ రోజు కేజ్రీవాల్ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తన విచారణకు రాలేనని తేల్చిచెప్పాడు. తనకు గోవాలో ముందస్తుగా పలు పార్టీ కార్యక్రమాలు షెడ్యూల్ చేయడం జరిగిందని.. ఈ క్రమంలోనే విచారణకు హాజరవర్వలేక పోతున్నట్లు తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే ఈ నెల 22 తర్వాత ఈ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు జరుగుతాయని.. పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News