Delhi: డేంజర్లోనే ఢిల్లీ.. విమానాలు రద్దు, మరికొన్ని ఆలస్యం

ఢిల్లీలో గాలినాణ్యత (Delhi AQI) ఇంకా డేంజర్ జోన్లోనే ఉంది. వరుసగా ఐదో రోజు అక్కడి గాలి నాణ్యత 400 పాయింట్లు పైగా నమోదైంది.

Update: 2024-11-17 04:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో గాలినాణ్యత (Delhi AQI) ఇంకా డేంజర్ జోన్లోనే ఉంది. వరుసగా ఐదో రోజు అక్కడి గాలి నాణ్యత 400 పాయింట్లు పైగా నమోదైంది. ఓ వైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం కలవడంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (Indira Gandhi International Airport)లో 800 మీటర్ల దూరంలో ఏముందో కంటికి కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు 3 విమానాలను క్యాన్సిల్ చేశారు. మరో 107 విమానాల రాకపోకలు ఆలస్యం అవుతాయని ఫ్లైట్ రాడార్ వెల్లడించింది. ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో ఏక్యూఐ 428గా నమోదైంది.

బుధవారం నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో డేంజర్, హై డేంజర్ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడి వాతావరణశాఖ చెప్పిన వివరాల ప్రకారం.. బవానాలో అత్యధికంగా 471 ఏక్యూఐ నమోదైంది. అశోక్ విహార్, జహంగీర్ పురి లలో 466, ముండ్కా, వాజిర్పూర్ లలో 463, ఆనంద్ విహార్, షాదిపూర్, వివేక్ విహార్ లలో 457, రోహిణి, పంజాబి బాగ్ లలో 449, 447 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ హై డేంజర్ కేటగిరీలో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 22 స్టేషన్లలో గాలినాణ్యత పూర్తిగా క్షీణించింది. 

Tags:    

Similar News