'సారే జహాన్ సే అచ్చా' కవి గురించిన పాఠం తొలగింపు
సారే జహాన్ సే అచ్చా' గేయం రాసిన కవి ముహమ్మద్ ఇక్బాల్ కు సంబంధించిన పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: 'సారే జహాన్ సే అచ్చా' గేయం రాసిన కవి ముహమ్మద్ ఇక్బాల్‌కు సంబంధించిన పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ తీర్మానం చేసింది. బీఏ ఆరవ సెమిస్టర్ పేపర్ లో భాగంగా ఉన్న మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్స్ అనే సబ్జెక్టులో ఇక్బాల్ కు సంబంధించిన సమాచారం ఉండగా దాన్ని తొలగిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది.
ఈ తీర్మానం పత్రాన్ని జూన్ 9న సమావేశం కానున్న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు సమర్పించబోతున్నారు. పాకిస్తాన్ ఏర్పాటుకు మహమ్మద్ ఇక్బాల్ ఆలోచన చేశారని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన వారి పాఠాలు సెలబస్‌లో ఉండకూండా ఈ తీర్మానం చేసినట్లు అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు చెప్పారు. కాగా ముహమ్మద్ అల్లామా ఇక్బాల్ 1877లో అవిభక్త భారతదేశంలో జన్మించాడు.ఈ నిర్ణయాన్ని ఏబీవీపీ స్వాగతించింది.