కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు

ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ యువ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. కుటుంబాలు నడిపే పార్టీలను యువత ఓడించాలని పిలుపునిచ్చారు.

Update: 2024-01-25 08:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ యువ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. కుటుంబాలు నడిపే పార్టీలను యువత ఓడించాలని పిలుపునిచ్చారు. కొత్తగా నమోదైన ఓటర్లతో ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరుగా నమోదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైనట్టేనని తెలిపారు. కొన్ని కుటుంబాలు నడిపే పార్టీల వల్ల యుువత రాజకీయంగా ఎదగలేక పోతున్నారని కాబట్టి ఆ పార్టీలను ఓటు అనే శక్తితో మట్టికరిపించాలన్నారు. దేశం ‘అమృత్‌ కాల్‌’లో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించడంలో యువకులదే కీలక పాత్ర అని తెలిపారు.

ఓటు చాలా శక్తివంతమైనది

‘మీ ఓటు చాలా శక్తివంతమైనది. దేశంలో పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడే సంచలన నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంటుంది’ అని చెప్పారు. పదేళ్ల క్రితం పాలించిన ప్రభుత్వాల తీరుతో యువత భవిష్యత్ అందకారంలోకి వెళ్లిందని ఆరోపించారు. కానీ ప్రస్తుతం యువతకు దేశంలో అపరిమిత అవకాశాలున్నాయని వెల్లడించారు. యువత కలలను నెరవేర్చడమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. మోడీకి గ్యారంటీలోనూ యువతకే ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతులు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ..తమ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందని చెప్పారు. దేశాన్ని ప్రగతి, అభివృద్ధి దిశగా నడిపించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.

Tags:    

Similar News