చంద్రయాన్-3 తొలి పరిశీలనలో ఏం తేలిందో తెలుసా?
చంద్రుడిపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 మిషన్ ఇప్పుడు జాబిల్లి ఉపరితలంపై తన పరిశీలనను మొదలుపెట్టింది. చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల పరిశీలన కోసం విక్రమ్ ల్యాండర్‌కు అమర్చి పంపిన పేలోడ్ ఈ పరిశీలన చేస్తున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రుడిపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 మిషన్ ఇప్పుడు జాబిల్లి ఉపరితలంపై తన పరిశీలనను మొదలుపెట్టింది. చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల పరిశీలన కోసం విక్రమ్ ల్యాండర్‌కు అమర్చి పంపిన పేలోడ్ ఈ పరిశీలన చేస్తున్నది. ఈ క్రమంలో ‘సీహెచ్ఏఎస్‌టీఈ’ పేలోడ్ తొలి పరిశీలనకు సంబంధించిన గ్రాఫ్‌ను ఇవాళ ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇస్రో పంపిన ఆ గ్రాఫ్ ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి లోతుకు వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు, పైకి వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో ఉష్ణోగ్రతల్లో మార్పులను సూచిస్తున్నది. ఒక మాపనాన్ని లోతుకు పంపి చంద్రుడి దక్షిణ ధృవానికి సంబంధించిన ఉష్ణోగ్రత వివరాలను పరిశీలించడం ఇదే తొలిసారని, ఇంకా సమగ్ర పరిశీలన కొనసాగుతున్నదని ఇస్రో తెలిపింది.