చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి
అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం గా ప్రకటించి..
న్యూఢిల్లీ : అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం గా ప్రకటించి.. శివ శక్తి స్థల్ ను దానికి రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరేదైనా ఇతర భావజాలానికి చెందిన వ్యక్తులు చంద్రుని ఉపరితలంపై జిహాద్ చేయడాని కంటే ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీనిపై పార్లమెంట్ లో, ఐక్యరాజ్యసమితిలో తీర్మానాలను ఆమోదించి చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని స్వామి చక్రపాణి విజ్ఞప్తి చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ జరిగిన ప్రాంతానికి ‘శివశక్తి’గా ప్రధాని మోడీ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.