తగ్గిన ద్రవ్యోల్బణం జూలైలో 6.71శాతం నమోదు.
దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా భారతదేశంలో వరుసగా మూడో నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతానికి తగ్గింది.
దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా భారతదేశంలో వరుసగా మూడో నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతానికి తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, గత నెలలో 7.01 శాతంగా నమోదైంది. జులై 2022లో ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 7.75 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింది. అలాగే, జూన్ 2022లో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి రెండంకెలలో వృద్ధి చెందింది12.3 శాతానికి పెరిగింది.అయితే, రిటైల్ ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ రేంజ్ 2-6 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో జూలై వరుసగా ఏడో నెల. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది, ఇది మే నేలలో 7.04 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. జూన్ 2022లో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 7.09 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 6.92 శాతంగా ఉంది.
సిబ్లింగ్స్‌లో గిల్లికజ్జాల పరిష్కారానికి పేరెంట్స్‌కు టిప్స్!