భూకంప ధాటికి 57 మంది మృతి

ప్రభావిత ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు, అక్కడికి అన్ని మార్గాల్లోనూ వస్తు సరఫరాకు ప్రభుత్వం శక్తిమేర కృషి చేస్తోందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వెల్లడించారు.

Update: 2024-01-02 18:24 GMT

దిశ, నేషనల్: భూకంపం ధాటికి జపాన్‌‌లోని పశ్చిమ ప్రాంతం అతలాకుతలమైంది. జపాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఒక్కరోజే 155 భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. 7.5తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భూకంపం ధాటికి మంగళవారం రాత్రివరకు 57 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా పశ్చిమ తీరప్రాంతాలకు చెందినవారేనని సంబంధిత అధికారులు వెల్లడించారు. భారీ భూకంపంతో ఇషికావా, పెనిన్సులా, నీగాటా, టొయామా సహా తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 35వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లన్నీ తెగిపోయాయి. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సైతం సంభవించాయి. అయితే, పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని ఇషికావా అధికారులు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు, అక్కడికి అన్ని మార్గాల్లోనూ వస్తు సరఫరాకు ప్రభుత్వం శక్తిమేర కృషి చేస్తోందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వెల్లడించారు.


Tags:    

Similar News