కేంద్ర హోంమత్రి అమిత్ షా తో బెంగాల్ గవర్నర్ భేటీ.. రాష్ట్రపతి పాలన విధించనున్నారంటూ ప్రచారం!
బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సోమవారం రాత్రి భేటీ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సోమవారం రాత్రి భేటీ అయ్యారు. బెంగాల్ లో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి అమిత్ షా కు ఆయన గవర్నర్ వివరించినట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మాట్లాడుతూ.. చీకటి రోజులు అంతమై కొత్త వెలుగు రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. శీతాకాలం వెంటే వసంత కాలం వస్తుందంటూ నర్మగర్భంగా మాట్లాడారు. ఇక గవర్నర్ మాటలను బట్టి చూస్తే బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు.
కాగా అంతకు ముందు బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసను అరికట్టడంలో విఫలమైందని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బ తిన్నందును రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. హింసకు పాల్పడినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.