న్యూఢిల్లీ: డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ అండ్రూ హెన్రిక్ క్రిస్టియన్ ఆయన సతీమణి మేరీ ఎలిజబెత్ రెండు దశాబ్దాల తర్వాత భారత్ వచ్చారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ల ఆహ్వానం మేరకు భారత్ వచ్చినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహాయపడుతుందని చెప్పారు. ముందుగా ఈ జంట ఆగ్రాలో పర్యటించారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి వచ్చే నెల 2న తిరుగు పయనం కానున్నారు. కాగా, వీరితో పాటు డెన్మార్క్ దేశ మంత్రులు కూడా ఉన్నారు.