Cyclone Asna: అస్నా తుపాను కల్లోలం.. కర్ణాటకు రెడ్ అలెర్ట్

దేశంలో అస్నా తుపాను కల్లోలం సృష్టిస్తోంది. కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Update: 2024-08-31 06:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అస్నా తుపాను కల్లోలం సృష్టిస్తోంది. కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అస్నా తుఫాను శుక్రవారం సాయంత్రం గుజరాత్‌ను దాటి వెళ్లిన ప్రాంతాలపై ఎటువంటి తీవ్ర ప్రభావం చూపలేదు. అరేబియా సముద్రం వైపు కదిలి ఈ తుపాను ఒమన్ వైపు వెళుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 అరేబియా సముద్రంలో మొదటిసారి ఈ తుపాను పాకిస్థాన్ లో ఏర్పడింది. అప్పుడు, దీనికి అస్నా తుపాను పేరుని ప్రతిపాదించారు. 1976, 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా పడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

గుజరాత్ ను ముంచెత్తిన వర్షాలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. దీంతో సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందిని సహాయాక బృందాలు రక్షించాయి. గుజరాత్‌ భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. అయితే, శుక్రవారం ఉదయం నాటికి గుజరాత్‌లోని చాలా ప్రాంతాలలో వర్షం తగ్గినప్పటికీ, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగే ఉన్నాయని అధికారులు తెలిపారు. శనివారం మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారలు అప్రమత్తం అవుతున్నారు.


Similar News