గెలుపే టార్గెట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా CWC మీటింగ్..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కాంగ్రెస్ మరింత దృష్టి సారించింది.

Update: 2023-10-09 08:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కాంగ్రెస్ మరింత దృష్టి సారించింది. సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార కమిటీ సీడబ్ల్యూసీ సమావేశం అయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరైన ఈ భేటీలో ప్రధానంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమిలో సీట్ల షేరింగ్ పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు పార్టీ వ్యూహాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా గత సెప్టెంబర్ 15,16వ తేదీలలో హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News