CUET (UG)-2024: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల
2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (CUET) యూజీ ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (CUET) యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. కాగా, పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్టును అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/CUET నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. అయితే, స్కోర్ కార్టును డౌన్‌లోడ్ చేసేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
కాగా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేషన్) దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుని ప్రవేశ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుంటుంది. ఎన్‌టీఏ నిర్వహించే సీయూఈటీకి లక్షల మంది హాజరు అవడానికి ప్రధాన కారణం.. అన్ని సెంట్రల్ వర్సిటీలకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షే ప్రామాణికం కావడమే.