కోల్‌కతా ఘటనపై క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా లో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనపై భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-18 14:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా లో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనపై భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తుడికి త్వరగా శిక్ష పడేలా చూడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఒక లేఖ రాశారు. 'బెంగాల్ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇది కేవలం ఒక అమ్మాయి మీద జరిగిన దాడి కాదు. సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతపై జరిగిన దాడి. వ్యవస్థలో పేరుకు పోయిన పురుష అహంకారం కళ్ళకు కడుతోంది. వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. తక్షణ చర్యల అవసరాన్ని ఈ ఘటన తెలుపుతోంది. దిగ్భ్రాంతికరమైన ఘటన ఇది' అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా హర్భజన్ లేఖను పోస్ట్ చేశారు. అభద్రతా వాతావరణంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని అంకితభావంతో పని చేయాలని మనం ఎలా అడుగుతాం? అని పేర్కొన్నారు. నిండుతులకు త్వరగా శిక్ష పడేలా బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ చర్యలు తీసుకోవాలని కోరారు.  


Similar News