కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్
ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలాకు పశ్చిమాన ఉన్న మందాల సమీపంలో చితా హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలాకు పశ్చిమాన ఉన్న మందాల సమీపంలో చితా హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాద సమయంలో చాపర్‌లో పైలట్, కో పైలట్‌తో పాటు మరో సీనియర్ అధికారి, ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Indian Army Cheetah helicopter has crashed near Mandala hills area of Arunachal Pradesh. Search operation for the pilots has started. More details awaited: Army sources pic.twitter.com/fqD0uu767w
— ANI (@ANI) March 16, 2023