శ్రీలంక కొత్త అధ్యక్షుడు దిసనాయకేకు సీపీఐ కార్యదర్శి డి.రాజా గ్రీటింగ్స్

శ్రీలంక(Sri Lanka) దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే(Dissanayake) ఎన్నికైన విషయం తెలిసిందే.

Update: 2024-09-24 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక(Sri Lanka) దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే(Dissanayake) ఎన్నికైన విషయం తెలిసిందే. మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో 42 శాతం ఓట్లతో దిసనాయకే గెలుపొందారు. దీంతో అక్కడి ప్రజలు మార్పు కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో ఈ ఫలితం కళ్లకు కట్టినట్లు చూపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. అవినీతిని అంతం చేస్తానని, రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వాగ్దానాలు ప్రజలను ఆకట్టుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా.. దిసనాయకేకు భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D. Raja) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ట్వీట్ పెట్టారు. ‘దిసనాయకే విజయం దక్షణాసియాపై మరియు ప్రపంచ రాజకీయ గమనంపై ప్రభావం చూపుతుంది. దిసనాయకే నాయకత్వంలో శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అధిగమించడమే కాకుండా శ్రీలంకలోని మైనారిటీల హక్కులకు కాపాడుతుందనే నమ్మకం కలిగింది. సమగ్ర సామాజిక-రాజకీయ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతారని సీపీఐ భావిస్తోంది. కొత్తగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడికి CPI తరపున శుభాకాంక్షలు’ అని డి.రాజా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.


Similar News