బాడీ మసాజర్‌‌ సెక్స్ టాయా ? హైకోర్టు కీలక ఆర్డర్

దిశ, నేషనల్ బ్యూరో : బాడీ మసాజర్‌‌ను సాధారణ వస్తువుగా పరిగణించాలా ? సెక్స్ టాయ్‌గా పరిగణించాలా ?

Update: 2024-03-21 12:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బాడీ మసాజర్‌‌ను సాధారణ వస్తువుగా పరిగణించాలా ? సెక్స్ టాయ్‌గా పరిగణించాలా ? అనే దానిపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాన్ని పెద్దల సెక్స్ టాయ్‌గా వర్గీకరించలేమని స్పష్టం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి నిషేధించబడిన వస్తువుల జాబితాలో బాడీ మసాజర్‌‌ను చేర్చలేమని పేర్కొంది. అయితే మసాజర్‌ల వంటి మెషీన్‌లను పుస్తకం, కరపత్రం, కాగితం, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి వస్తువులతో పోల్చలేమని హైకోర్టు తెలిపింది. 2022 ఏప్రిల్‌లో విదేశాల నుంచి ముంబై నగరానికి దిగుమతి అయిన బాడీ మసాజర్ల స్టాక్‌ను ముంబై కస్టమ్స్ కమిషనర్ జప్తు చేశారు. ‘‘బాడీ మసాజర్లు పెద్దల సెక్స్ టాయ్‌లు. 1964 జనవరిలో జారీ చేసిన కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం వాటిని దిగుమతి చేసుకోవడం నిషిద్ధం’’ అని ఆ సరుకును దిగుమతి చేసుకున్న వ్యాపారులకు తేల్చిచెప్పారు. ఈ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సరుకు యజమానులు కస్టమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అది అప్పట్లో వ్యాపారులకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. బాడీ మసాజర్‌ను కేవలం సెక్స్ టాయ్‌గా వాడుతారనేది కస్టమ్స్ కమిషనర్ అపోహ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ ఆర్డర్‌‌పై ముంబై కస్టమ్స్ కమిషనరేట్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునే సమర్ధించింది.

Tags:    

Similar News