రాహుల్ గాంధీ ‘జేబు దొంగ’ కామెంట్స్‌పై ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

Update: 2023-12-21 13:47 GMT

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీని జేబుదొంగగా పేర్కొంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‌గాంధీ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో 8 వారాల్లోగా నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నిర్దేశించింది. నవంబరు 22న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రధాని మోడీపై రాహుల్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. వాటిపై వివరణ కోరుతూ రాహుల్ ‌గాంధీకి వెంటనే ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఆ నోటీసుల ప్రకారం.. త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ భరత్ నాగర్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ‘‘ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోగా షోకాజ్ నోటీసుకు రాహుల్ రిప్లై ఇవ్వనందున.. ఆయనపై తదుపరి చర్యలను వేగవంతంగా చేపట్టాలి. ఆ దిశగా ఈసీ నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆదేశించింది.

Tags:    

Similar News