Bengaluru: నటుడు దర్శన్‌ను వేరే జైలుకు తరలించనున్న అధికారులు

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ తూగుదీప జైలులో వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్న వీడియో, ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-08-27 14:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ తూగుదీప జైలులో వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్న వీడియో, ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శన్‌తో పాటు ఇతర నిందితులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లకు తరలించాలని బెంగళూరు కోర్టు మంగళవారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో సహ నిందితురాలు, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ పరప్పన అగ్రహార జైలులోనే ఉండనుంది.

మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను విచారణ కోసం ఏర్పాటు చేసింది. ఇప్పటికే చీఫ్ జైలు సూపరింటెండెంట్ వి శేషుమూర్తి, జైలు సూపరింటెండెంట్ మల్లికార్జున్ స్వామితో సహా తొమ్మిది మంది జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఈ విషయంలో జైలు అధికారుల తప్పిదం జరిగిందని తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.


Similar News