Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాకు మళ్లీ ఎదురుదెబ్బ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-04-30 11:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తోసి పుచ్చింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఇవాళ జడ్జిమెంట్ వెల్లడించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేశాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి నిరారించాయి.

Tags:    

Similar News