Coromandel express accident :కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే
కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
దిశ, వెబ్‌డెస్క్: కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 233 మంది దుర్మరణం చెందారు. 900 మందికి గాయాలయ్యాయి.తొలుత బెంగళూర్ - హావ్ డా బోగీలు పట్టాలు తప్పగా వాటిని కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ట్రాక్ పై పడిన కోరమండల్ బోగీలను గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘నిద్ర రావడంతో పడుకున్నా.. రైలు ప్రమాదానికి గురైనప్పుడు మెలకువ వచ్చింది. మాది రిజర్వేషన్ బోగీ అయినా జనరల్ బోగీలానే ఉంది. పది, పదిహేను మంది నాపై ఒక్కసారిగా పడ్డారు. నేను అందరికంటే కింద ఉండిపోయాను. నా చేతికి, మెడపై గాయమైంది. నేను ట్రైన్ నుంచి బయటకు వచ్చినప్పుడు కొందరికి కాళ్లు లేకపోవడం, కొందరికి చేతులు లేకపోవడం, కొందరి ముఖంపై దెబ్బలు చూశాను. తర్వాత నేను తిరిగి వచ్చి ఇక్కడే కూర్చున్నాను.’ అని తెలిపాడు.
Also Read...
కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : రక్తదానం చేసేందుకు బారులు తీరిన యువత (వీడియో)