Coromandel express accident : కీలకంగా మారనున్న కోరమండల్ లోకోపైలట్ స్టేట్ మెంట్!
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ హజారి అపస్మారక స్థితిలో ఉన్నాడు. శుక్రవారం రాత్రిపూట కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ ను ఢీ కొట్టింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ హజారి అపస్మారక స్థితిలో ఉన్నాడు. శుక్రవారం రాత్రిపూట కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన హజారి ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ తప్పి గూడ్స్ ట్రైన్ ఆగి ఉన్న ట్రాక్ లోకి తప్పుడుగా వెళ్లడమే కారణం అని రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హజారే స్టేట్ మెంట్ కీలకం కాబోతోంది. మెయిన్ లైన్ పై వెళ్లేందుకు కోరమండల్ కు సిగ్నల్ ఉందని అయినప్పటికీ లూప్ లైన్ లోకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే విషయాల్లో హజారే కోలుకుని ఆయన చెప్పబోయే విషయాలు కీలకం అవుతాయనే చర్చ జరుగుతోంది.
Read more: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రిపోర్టు ఇదే..
Read more: ఒడిశా రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే!
Coromandel express accident : రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోడీ