అసోంలో నియోజకవర్గాల డిలిమిటేషన్‌పై ఎన్నికల ప్రధాన కమిషనర్ కీలక వ్యాఖ్యలు..

Update: 2023-03-28 14:33 GMT

డిస్పూరు: అసోంలో నియోజకవర్గాల డిలిమిటేషన్‌పై భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో డిలిమిటేషన్‌పై చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలు, 14 పార్లమెంటరీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో గుర్తింపు ఉన్న 9 పార్టీలు, 60 సంస్థలతో గత రెండు రోజులుగా చర్చలు నిర్వహించాం. పార్టీలు, సంస్థల సూచనలను పునర్వ్యస్థీకరణ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటాం’ అని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఏప్రిల్ 15వరకు గడువు పొడగిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత నెల రోజుల్లో సంబంధిత డ్రాఫ్ట్ విడుదల చేస్తామని తెలిపారు.

కాగా, అసోంలో నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ 1971, 76 లలో జరిగింది. మరోవైపు అసోంలో డిలిమిటేషన్ ప్రక్రియ మ్యాచ్ ఫిక్సింగ్ అన్న కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించారు. తాము ఎవరి సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కమ్యూనిటీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని.. చట్టపరమైన సమానత్వ సూత్రాలకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News