రిక్రూట్‌మెంట్ కమిషన్‌కు తాళం వేసిన కాంగ్రెస్: ప్రధాని మోడీ విమర్శలు

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మతతత్వం, కులతత్వం, రాజవంశ రాజకీయాలు చేయడం సర్వసాధారణం.

Update: 2024-05-24 10:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు ఆ పార్టీ ప్రభుత్వం తాళం వేసిందని మోడీ ఆరోపించారు. శుక్రవారం రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లా నహాన్‌లో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న మోడీ.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మతతత్వం, కులతత్వం, రాజవంశ రాజకీయాలు చేయడం సర్వసాధారణం. నహాన్, సిర్మౌరా నాకు కొత్త కాదు, నహాన్‌లో ఇప్పటివరకు ఇలాంటి చారిత్రాత్మక ర్యాలీని ఎన్నడూ చూడలేదని మోడీ అన్నారు. బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చాను. నా కోసం, నా కుటుంబం కోసం కాదు, అభివృద్ధి చెందిన దేశం కోసం ఓటు వేయాలని మోడీ ప్రజలనుద్దేశించి అన్నారు. సరిహద్దుల్లో నివశించే హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు బలమైన దేశం విలువ తెలుసని పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సఖు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2022, డిసెంబర్ పేపర్ లీకేజీ కారణంగా హెచ్‌పీఎస్ఎస్‌సీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే ప్రధాని మోడీ సెలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ తాళం వేసిందంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో మరోసారి ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కొని ముస్లింలకు ఇస్తోందని మోడీ ఆరోపించారు. 

Read More..

Ambani: అనిల్‌ అంబానీకి నోటీసులు.. రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం

Tags:    

Similar News