Sebi chief's husband: మహీంద్రా గ్రూప్ నుంచి రూ.4.78 కోట్లు తీసుకున్నారు.. సెబీ చీఫ్ పై కాంగ్రెస్ ఆరోపణలు

సెబీ (SEBI) చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది.

Update: 2024-09-10 10:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సెబీ (SEBI) చీఫ్ మాధబి పూరి బుచ్ పై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్(Mahindra and Mahindra Group) నుండి 2019-2021 మధ్యకాలంలో మాధబి భర్త ధవల్ బుచ్ రూ.4.78 కోట్లు అందుకున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అగోరా గ్రూప్ అందుకున్న రూ.2.95 కోట్లలో రూ.2.59 కోట్లు అంటే దాదాపు 88 శాతం ఒక్క మహీంద్రా గ్రూప్ నుంచే అందిందని అన్నారు. మహీంద్రా సంస్థ నుంచే కాకుండా డాక్టర్ రెడ్డీస్, పిడ్‌లైట్, ఐసీఐసీఐ, సెంబ్‌కార్ప్, విసు లీజింగ్ అండ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ సంస్థలకు కూడా సేవలందించాలని అన్నారు. సెబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమె యాజమాన్యంలోని అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సంపాదించడం కొనసాగించిందని ఆయన ఆరోపించారు. సెబీలో చేరినప్పట్నుంచి అగోరా కంపెనీ కార్యకలాపాలు కొనసాగించట్లేదని మాధబి చెప్పారని గుర్తుచేశారు.

ఆరోపణలను కొట్టిపారేసిన మహీంద్రా కంపెనీ

మహీంద్రా గ్రూప్ ఆరోపణలను "అసత్యాలని, తప్పుదోవ పట్టించేవి" అని పేర్కొంది. "మాధని భర్త ధవల్ బుచ్ సప్లయ్ చైన్ కన్సల్టింగ్ కంపెనీ అయిన బ్రిస్టల్‌కోన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిస్టిల్ కోన్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. సెబీ ఛైర్ పర్సన్ గా మాధబి పూరీ బుచ్ నియమితులు కావడానికి దాదాపు మూడేల్ల ముందే ఆయన మహీంద్రా గ్రూప్‌లో చేరాడు.” అని మహీంద్ర గ్రూప్ ప్రకటనలో పేర్కొంది. యునిలీవర్ కంపెనీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత 2019లో తమ కంపెనీలో చేరిన ధవల్ బుచ్ చేరారని తెలిపింది. సప్లయ్ చెయిన్ మేనేజ్ మెంట్ కోసం మాత్రమే ధవల్ బుచ్ ని నియమించినట్లు వెల్లడించింది.


Similar News