కాంగ్రెస్ యూటర్న్.. శామ్ పిట్రోడాకు మళ్లీ అదే పదవి

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల టైంలో శామ్ పిట్రోడా‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయనను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి నుంచి హస్తం పార్టీ తప్పించింది.

Update: 2024-06-26 15:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల టైంలో శామ్ పిట్రోడా‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయనను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి నుంచి హస్తం పార్టీ తప్పించింది. అయితే శామ్ పిట్రోడా బుధవారం మళ్లీ అదే పదవిలో నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. బుధవారం నుంచే ఆయన నియామకం ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులను చైనీయులు, అరబ్బులు, శ్వేతజాతీయులు, ఆఫ్రికన్లతో పోలుస్తూ ఆయన చేసిన కామెంట్స్‌పై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల టైం కావడంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


Similar News