నితీష్ లాంటి పిరికి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు.. ఖర్గే సీరియస్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏ కూటమిలో చేరడంపై మంగళవారం ఖర్గే మరోసారి స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏ కూటమిలో చేరడంపై మంగళవారం ఖర్గే మరోసారి స్పందించారు. ఇలాంటి పిరికి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి.. మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి దేశంలో ఎన్నికలు జరుగడం కూడా కనిపించవు అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఖర్గే కామెంట్స్‌పై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రాకముందే ఘాటు వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెండంతో బీజేపీయేతర పార్టీల్లో చర్చ మొదలైంది. వ్యూహాత్మకంగానే ఖర్గే ఈ తరహా కామెంట్స్ చేశారని తెలుస్తోంది. మరోవైపు ఖర్గే కామెంట్స్‌కు బీజేపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అధికార విపక్షాలు మాటల తూటాలతో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.