బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది: కాంగ్రెస్
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు. మరోవైపు ఈ బిల్లును ఇండియా కూటమి ఎంపీలు వ్యతిరేకించారు. ఈ బిల్లు మత విభజనను సృష్టిస్తుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చారని మండిపడ్డారు. కాగా, వక్ఫ్‌బోర్డుల పేరుతో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఎందరో ముస్లింలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. మాఫియా నాయకత్వంలో వక్ఫ్‌బోర్డులు నడుస్తున్నాయని చెప్పారని, వాళ్లపేర్లు తాను సభలో చెప్పడం సమంజసం కాదని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు. ఎందరో సామాన్య ప్రజలతో మాట్లాడిన తర్వాత వక్ఫ్‌బోర్డు చట్టంలో సవరణలు తేవాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఢిల్లీ, పాట్నా, లక్నో, జమ్ము-కశ్మీర్‌లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు.