కోర్టుకు హాజరుకాని రాహుల్!
పరువునష్టం కేసులో పాట్నా కోర్టుకు కాంగ్రెస నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివాదాలు వీడటం లేదు. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు తాజాగా బిహార్ పాట్నా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 25న కోర్టు ముందు హాజరుకావాలని పేర్కొంది. మోడీ ఇంటి పేరు కలిగిన వారంతా దొంగలేననే అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు.
గత నెల 18న ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇవాళ కోర్టుకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా ఇతర పనుల కారణంగా రాహుల్ తన తరపున న్యాయవాదులను పంపించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ సూరత్ కోర్టు కేసులో బిజీగా ఉన్నారని అందువల్ల మరో తేదీన కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి కేసును ఏప్రిల్ 25కు వాయిదా వేశారు.