Rajnath Singh: ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు యత్నించింది.. కాంగ్రెస్ పై రాజ్ నాథ్ విమర్శలు

భారత రాజ్యాంగంపై ఉభయసభల్లో చర్చ జరిగింది. కేంద్రం తరఫున లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) ఈ చర్చను ప్రారంభించారు.

Update: 2024-12-13 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగంపై ఉభయసభల్లో చర్చ జరిగింది. కేంద్రం తరఫున లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) ఈ చర్చను ప్రారంభించారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన (75 years of the Constitution began) సందర్భంగా జీరో అవర్ తర్వాత పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన కొందరి ప్రయత్నాలను గుర్తించలేకపోయామని రాజ్ నాథ్ అన్నారు. ‘‘రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన కొందరి పాత్ర విస్మరణకు గురైంది. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటస్ఫూర్తి నుంచి ఈ రాజ్యాంగం ఉద్భవించింది’’ అని మంత్రి (Rajnath Singh) వెల్లడించారు. అప్పుడు రాజ్యాంగ రూపకల్పన కోసం ఏర్పాటైన కమిటీలో భాగం కాకపోయినా.. మదన్‌మోహన్‌ మాలవీయ, లాలా లజ్‌పత్‌రాయ్‌, భగత్‌సింగ్‌, వీర్‌ సావర్కర్‌ వంటి ప్రముఖుల ఆ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ పైన రాజ్ నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశించి విమర్శలు చేశారు. దీంతో, లోక్ సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం వరకు కొనసాగే ఈ చర్చకు ముగింపుగా ప్రధాని మోడీ సమాధానం ఇస్తారు.

రాజ్యాంగం రోడ్ మ్యాప్ గా..

దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా యూజ్ అవుతుందని రాజ్ నాథ్ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి అని, ప్రతి వ్యక్తికి బలమైన గుర్తింపును అందిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కాగా, శనివారం వరకూ ఈ చర్చ కొనసాగుతుంది. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక చర్చకు ముగింపుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) రేపు సమాధానం ఇవ్వనున్నారు.

Tags:    

Similar News