జైపూర్‌లో కలకలం..పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌లలోని స్కూళ్లకు హెచ్చరికలు రాగా.. తాజాగా సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌లలోని స్కూళ్లకు హెచ్చరికలు రాగా.. తాజాగా సోమవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. సుమారు నాలుగు స్కూళ్లకు ఈ మెయిల్ ద్వారా వార్నింగ్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సెయింట్ థెరిసా స్కూల్, ఎంపీఎస్ స్కూల్, విద్యాశ్రమ్ స్కూల్, మానక్ చౌక్ పాఠశాలల్లో బాంబులు అమర్చామని ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్లకు ఈ మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా పాఠశాలల్లోని పిల్లలను బయటకు పంపించారు. మెయిల్ పంపిన వ్యక్తి ఈ మెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం సాయంత్రం ఢిల్లీ నగరంలోని 20ఆస్పత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.