Kerala: క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరు ఐఏఎస్ లపై వేటు
క్రమశిక్షణా చర్యల కింద కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం(Left government in Kerala) ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లపై(IAS Officer) వేటు వేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: క్రమశిక్షణా చర్యల కింద కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం(Left government in Kerala) ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లపై(IAS Officer) వేటు వేసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ కే గోపాలకృష్ణన్, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రశాంత్ ను విజయన్ ప్రభుత్వం సస్పెండే చేసింది. 2013 బ్యాచ్ ఆఫీసర్ అయిన గోపాలకృష్ణన్(Gopalakrishnan).. మల్లు హిందూ ఆఫీసర్స్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపు నడుపుతున్నారు. మతం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపును గోపాలకృష్ణన్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తన ఫోక్ హ్యాక్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఆ ఫోన్ హ్యాక్ కాలేదని నిర్ధారించారు. వివాదం నేపథ్యంలో ఆ ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు.
కలెక్టర్ బ్రో
గతంలో కోజికోడ్(Kozhikode) జిల్లా కలెక్టర్‌గా, ఇతర ఉన్నత పదవుల్లో పనిచేసిన ప్రశాంత్(Prasanth) 'కలెక్టర్ బ్రో'గా ప్రసిద్ధి చెందారు. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి గతంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఓ సీనియర్ అధికారిపై ఆరోపణలు చేసి తీవ్రంగా విమర్శించిన ఘటనలో ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నారు. అదనపు కార్యదర్శి ఏ జయతిలక్‌పై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన 2007 బ్యాచ్ ఆఫీసర్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నారు. సీనియర్ ఆఫీసర్ ఓ సైకో అంటూ ఆయన ఆ పోస్టులో ఆరోపించారు. కాగా.. ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేరళ సీఎం పినరయి విజయన్ ఈ చర్యలు తీసుకున్నారు.