Cm mk stalin: తమిళనాడు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి..సీఎం స్టాలిన్

2024-25 కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా చెన్నయ్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం ఎలాంటి ఫండ్స్ అందించలేదని తెలిపారు.

Update: 2024-07-21 13:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2024-25 కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా చెన్నయ్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం ఎలాంటి ఫండ్స్ అందించలేదని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘తమిళనాడు ప్రజలు చెన్నయ్ మెట్రో రైలు కోసం మూడేళ్ల పెండింగ్ నిధులను విడుదల చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే తాంబరం- చెంగల్ పట్టు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌కు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు’ అని తెలిపారు. సుమారు10 సంవత్సరాలుగా, మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయపు పన్ను భారం తగ్గుతాయని, వారికి పన్ను రాయితీని అందించాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు, మధురైలో మెట్రో రైలు ప్రాజెక్టుల ఆమోదం, ఇప్పటికే ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులకు తగిన నిధుల కేటాయింపు, గ్రామీణ పట్టణ గృహ పథకాల కింద వ్యయ పరిమితిని పెంచడం వంటివి పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

Tags:    

Similar News