CM Atishi : బీజేపీ నేత బీధూరి వ్యాఖ్యలపై సీఎం అతిషి కంటతడి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో కల్కాజీ నియోజకవర్గంతో తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ రమేష్ బిధూరి(Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిషి(CM Atishi) మీడియా సమావేశంలో కంటతడి(Crying) పెట్టారు.
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో కల్కాజీ నియోజకవర్గంతో తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ రమేష్ బిధూరి(Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిషి(CM Atishi) మీడియా సమావేశంలో కంటతడి(Crying) పెట్టారు. ఎన్నికల ప్రచారంలో రమేష్ బిధూరి మాట్లాడుతూ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఇంటిపేరు మార్లెనా నుంచి సింగ్‌గా మారిందని, ఆమె తన తండ్రినే మార్చేసిందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియా సమావేశంలో స్పందించిన అతిషి రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
తన తండ్రి తన జీవితమంతా ఒక టీచర్‌గా పనిచేశారని, పేద, మధ్యతరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు పాఠాలు చెప్పారని, ఇప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలని అతిషి తెలిపారు. ఆయన నిజంగానే అస్వస్థతతో ఉన్నారని, ఎవరో ఒకరి సాయం లేకుండా నడవలేకపోతున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసమని తన తండ్రిపై బిధూరి బురద చల్లుతారా? ఒక వృద్ధుడిపై నిందలు వేస్తారా? అని అతిషి మండిపడ్డారు.
ఈ దేశ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతాయని తాను ఎన్నడూ అనుకోలేదని అతిషి తెలిపారు. ప్రచారంలో బిధూరి పదేళ్లుగా కల్కాజీ నియోజకవర్గానికి చేసిన పనులు ఉంటే వాటి గురించి చెప్పుకోవచ్చని.. చేసిన పనుల ఆధారంగా ఓట్లు అడగొచ్చని..కానీ మా తండ్రిగారిని అవమానించడం సరికాదని అతిషి ఆవేదన వ్యక్తం చేశారు.