Gujarat: కూలిన క్లాస్ రూమ్‌ గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ విద్యార్థులు

క్లాస్ రూమ్ గోడ కూలిపోవడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి విద్యార్థులు కిందపడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Update: 2024-07-20 13:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: క్లాస్ రూమ్ గోడ కూలిపోవడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి విద్యార్థులు కిందపడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరలో పాఠశాల తరగతి గది గోడ కూలిపోవడంతో శుక్రవారం ఓ విద్యార్థి గాయపడ్డాడు. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో తరగతి గది ఉంది. గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో క్లాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం వల్ల పైనుంచి బెంచీలతో సహా ఆరుగురు విద్యార్థులు కిందపడ్డారు. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకి భోజన విరామ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత మేము సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. ఆ సమయంలో ఒక విద్యార్థి తలకు గాయమైంది. వెంటనే మిగతా విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించామని పాఠశాల ప్రిన్సిపాల్ రూపల్ షా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం వడోదర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై వారు దర్యాప్తు ప్రారంభించారు. 

Tags:    

Similar News