Chiraag paashwan: ఎస్సీ వర్గీకరణ తీర్పుపై అప్పీల్ చేస్తాం..కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేకించారు. ఈ తీర్పుపై తమ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించారు.

Update: 2024-08-03 19:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేకించారు. ఈ తీర్పుపై తమ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎస్సీ కోటాలో క్రీమీ లేయర్‌ను అనుమతించలేము. దీని ద్వారా సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని’ తెలిపారు. మెజారిటీ షెడ్యూల్డ్ కులాల ప్రజలు బాగా డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చి విద్యను అభ్యసించినప్పటికీ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయడం సమర్థనీయం కాదన్నారు. కుల గణనకు అనుకూలంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే దాని ఫలితాలను బహిరంగపర్చకూడదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల కోసం మాత్రమే దానికి ఉపయోగించాలని సూచించారు. అయితే ఎస్సీ వర్గీకరణ అంశంపై తన కూటమి భాగస్వామి జేడీయూ తీసుకున్న వైఖరిపై వ్యాఖ్యానించడానికి పాశ్వాన్ నిరాకరించారు.

Tags:    

Similar News