5 వేల మంది సైనికులకు చైనా శిక్షణ

చ్చే ఐదేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 5 వేల మంది భద్రతా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు చైనా వెల్లడించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సీపీఎం) పేర్కొంది...

Update: 2023-02-26 16:18 GMT
  • భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారం కోసం
  • సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడి

బీజింగ్: వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 5 వేల మంది భద్రతా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు చైనా వెల్లడించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సీపీఎం) పేర్కొంది. బీజింగ్‌కు చెందిన గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనే పత్రిక దీన్ని ప్రచురించింది. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారంతో పాటు మరిన్ని వేదికలను సంపాదించేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

‘తీవ్రవాద వ్యతిరేకత, సైబర్ భద్రత, బయో సక్యూరిటీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి రంగాల్లో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారంతో పాటు వేదికలను సంపాదించుకునేందుకు బీజింగ్ యోచిస్తోంది’ అని ఎస్‌సీపీఎం పేర్కొంది. యూనివర్సీటీ స్థాయి సైనిక, పోలీసు అకాడమీల మధ్య పరస్పర సహకారాన్ని చైనా ప్రోత్సాహిస్తోంది. ఇది ప్రపంచ భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు చైనాకు సహాయపడుతుందని గ్లోబల్ సెక్యూరిటీ షఇనిషియేటివ్ (జీఎస్ఐ) చెబుతోంది. ‘ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్రవాద నిరోధక అధికారులకు చైనా శిక్షణ ఇచ్చేది. ఇప్పుడు ఈ సహకారాన్ని మరింత విస్తరించింది.

ఈ శిక్షణ, మార్పిడిలు ఉగ్రవాద వ్యతిరేక రంగంలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంలో సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (సీఐసీఐఆర్)లో తీవ్రవాద నిపుణుడు లీ వీ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలకు చెందిన 2 వేల మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి శిక్షణ ఇస్తుందని గతేడాది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేకతపై దృష్టి సారించే శిక్షణా స్థావరాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News